మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద
పది తలల రావణుడితో
పోరు కొరకే కదిలాడు
ఇక ఎవడూ ఆపగలడు
దహనం చేస్తాడు
తెగబడినా రాక్షసులతో
నేడు సహనం మరిచాడు
ఇక ఎవడూ ఆపగలడు
మరణం రాస్తాడు
చెడునంతమే చేసేలా
చెలరేగినదీ జ్వాల
చెరబట్టిన మృత్యువు తోనే
యుద్ధం ఈ వేళ
నరమే కొలిమవ్వాలా
నరమేధమే జరగాలా
నరకాసుర రక్తం తోనే
నేలే తడవాలా
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యల హేల హేల హే లా
యల హేల హేల హే
యల హేల హేల హే లా
యల హేల హేల హే
యల హేల హేల హే
మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద
మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద
అవమానమే అన్ని వైపుల
పెను ఉప్పెన నిన్ను కూల్చేరా
భగ భగ, భగ భగ
కలలన్ని కాలే కదరా
నడి గుండెలో కత్తి దించగా
ప్రతిదీ ఇక దూరమయ్యెగా
భగ భగ, భగ భగ
నువ్వు మండుతూనే పదరా
తడి ఉండే కంటిలోనే
బడబాగ్నే నింపరా
తరువాతి జాతికైనా
సంకెలలే తెంచరా
చెడునంతమే చేసేలా
చెలరేగినదీ జ్వాల
చెరబట్టిన మృత్యువుతోనే
యుద్ధం ఈ వేళ
నరమే కొలిమవ్వాలా
నరమేధమే జరగాలా
నరకాసుర రక్తం తోనే
నేలే తడవాలా
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యల హేల హేల హే లా
యల హేల హేల హే
యల హేల హేల హే లా
యల హేల హేల హే
యల హేల హేల హే
మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద




