(ఆనంద ఋతు వాసంతముల)
(ఆగమన విధిరా)
(నీ రూపు గని మా ఊపిరులు)
(యమునలై అలలెగసెనురా)
ఎందరు అమ్మలో దేవకి నందన
ఈ వరమేదీ మరవరి కైనా
ఎందరు అమ్మలో దేవకి నందన
ఈ వరమేదీ మరవరి కైనా
మా ఒడి పాపగా నీవిటు చేరుట
ఎన్నటి పుణ్యమే గోపమ్మ
అల్లరి తీరగా ఆటలు ఆడరా
గోకులమంతా నీదనుకో కన్నా
ఎందరు అమ్మలో దేవకి నందన
(నీ రాక విని గోమాతలకు)
(పాలూరినవి రా)
(మా ఇంట చిలికే వెన్న)
(నిను చేరగా)
(తహ తహ మనెరా)
గమప గమగ స సగ సరి సరి
సరి పమ నిస గా
గమప గమగ స సగ సరి
సరి పమ నిస గా
గమపద నిద పమగ
గమపద నిదా పనిస
గమపద నిద పమగ
గమపద నిదపమ పనిస
ఆకలి కేకవై అలకలు పూనగ
మురిపించుమా ముద్ద తినిపించుమా
ఆవులింతల నీవు అలసిన వేళన
అరుదెంచుమా లాలి వినిపించుమా
నీ కాలి అందెల సందడి రాలేడు
మా ఎద సవ్వడి మ్రోగెరా కన్నా
వటపత్రసాయివై అండగ నీవుండ
ఏ చింత మా చెంత
రాదురా కన్నా
ఎందరు అమ్మలో దేవకి నందన
స స స ని స ని పని పమ పమగ సరిగమ గమా
గమపదని పమగని గమగ సస సరినిసనీ
స స పమగమ గరి గమ గమ
ప ప నిగగమ సరి గమ గమ గమ పని
స స సరి పమ గరి గమ గ
గమపనిప గమపని సా





