ఆణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర తీరాలు
నీ కోసమే
ఆణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని
తారలైన తాకలేని తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర తీరాలు
నీ కోసమే
కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే
కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే
మరిచా ఏనాడో ఇంత సంతోషమే
తీరే ఇపుడే పాత సందేహమే
నాలో లేదే మనసే నీతో చేరే
మాటే ఆగి పోయే పోయే పోయే
ఈ వేళనే
ఆణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే




