సుహాసినీ ఆహా ఎమున్నావే
శ్రీదేవి నీ ఓహో మించేసావే
బంగారు బాణాలు విసిరేసే కన్నులు తో
గుండెల్లో గుచ్చావే లైలా
బంగాళాఖాతం లా నా మనసు మార్చేసి
అలలేవో పొంగిస్తే ఎలా
అల్లరళ్లరి చేసే నీ తీయని నవ్వుల కొస
ఆదమరిపించేసే నీ ఊసుల కై ఊగిస
తెల్లవారిందంటే నీ పదనిస కై యద నస
రాతిరైతే చాలే నీ కలలే కనులకు బస
సుహాసినీ ఆహా ఎమున్నావే
శ్రీదేవి నీ ఓహో మించేసావే
అయిదడుగల నింగి తారనే నేను చూస్తున్న
తన అందమే అయిస్కాంతం ఎవరు కాదన్నా
తన కోసమే ప్రాణముందని తెలుసుకుంటున్నా
తొలిసారిగ ప్రేమ మైకం ఏం చేసినా
ఎన్నాళ్ళు ఉంటుందో నా ఊపిరే
అన్నాళ్ళు నీ జంట గా
కన్నీళ్ళు రాకుండా నీ కన్ను కే
కడతాను కవచాన్నిలా
కాదు కాదంటున్నా
నీ వెనుకే వస్తానిలా
కట్టుబడి పోతున్నా
నీ కబురుల గది లోపల
వేల భాషలు ఉన్నా
మాటలకే అందని కల
నేను గా నిలుచున్నా
నిజమల్లే మార్చేఇలా
సుహాసినీ ఆహా ఎమున్నావే
శ్రీదేవి నీ ఓహో మించేసావే
