శ్రీ గౌరి శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ
గంగ చిందులు వేసినా శ్రీ గౌరి శ్రీ గౌరియే
సతిగా తనమేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి సతిగా
తనమేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి పరమేశునికై తపియించి
పరమేశునికై తపియించి ఆ హరు మేన సగమై పరవశించిన శ్రీ గౌరి శ్రీ గౌరియే
నగకన్యగా తాను జనియించినా జగదంబయైనది హైమవతి నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి సురలోకమున తాను ప్రభవించినా
తరళాత్మయైనది మందాకిని ఒదిగి ఒదిగి పతి పదములందు నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతి సిగను దూకి నటియించుచుండు గంగ లలితరాగ
కలితాంతరంగ గౌరి చలిత జీవన తరంగ రంగ గంగ ధవళాంశు కీర్తి గౌరి
నవఫేనమూర్తి గంగ కల్పాంతమైన భువనాంతమైన క్షతి
యెరుగని మృతి యెరుగని నిజమిది శ్రీ గౌరి శ్రీ గౌరియే.





