ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో (అహహా అహహహా)
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో (అహహా అహహహా)
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా (అహహ అహా అహహహా ఆహహహా)
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా (అహహా అహహహా)
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా (అహహ అహా అహహహా ఆహహహా)
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా (అహహా అహహహా)
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో



