కొప్పింటి సింగదాన గోరుకు తెలియని గాయం
చేసెళ్ళిపోతున్నవా
అయినింటి నాదాన అరికాడతో ఎదమీద
తన్నేసి తొక్కుతున్నవా
గావురాల దొరబిడ్డ గడికాడ నిన్ను చూసి
కాడంగా ప్రేమిస్తావనుకొనినే మనసు వడితే
మేడలల్ల వెరిగిన గాని మల్లె మనసు ఉన్నదని
మేలిమి బంగారం అనుకొని నిన్ను ప్రేమిస్తే
అద్దాల అంతఃపురము అందాల ఓసినుప్ప
మనసు వడి నీ మీద మోసవోతినే ఇంకా
అద్దాల అంతఃపురము అందాల ఓసినుప్ప
మనసు వడి నీ మీద మోసవోతినే ఇంకా
ఊరి గుడిసె పేదోన్ని పన్నెత్తి వలుకరిస్తే
పదారు వండ్లకెల్ద ఇసమవుతాననుకోలే
ఊలి నాలి చేసేటోన్ని కన్నెత్తి నువ్వు చూస్తే
నన్నుగన్న తల్లివని పానంగా చూస్తిగదే
బందీని నన్ను చేసి బాధలెన్నో వెడుతున్న
చూసి కూడా జాలిలేని బండరాయివైపోతివ
బందీని నన్ను చేసి బాధలెన్నో వెడుతున్న
చూసి కూడా జాలిలేని బండరాయివైపోతివ
తలమీద సేయి వెట్టి సల్లగ నువ్వు దడుముతుంటే
కలిలేని బాధ నాకు తీరుస్తావనుకుంటి
ఎన్ను తట్టి మాట గలిపి మందలించి చూస్తుంటే
మనువాడు గుంటావని కలలెన్నో గంటిగదే
కాలేటి నిప్పు కలల్ల నన్ను గాల్చిన బాగుండే
ఏగలేని ఈ బాధ కూరి తాడెం మిగిలిల్దే
కాలేటి నిప్పు కలల్ల నన్ను గాల్చిన బాగుండే
ఏగలేని ఈ బాధ కూరి తాడెం మిగిలిల్దే
వేరోని ఏలు పట్టి ఎదురుంగా పరుగుదీస్తే
మీ ఓళ్ళ నాపుకుంటూ చిత్రంగా చూస్తిగదే
ను కోరి నోనితోనే సల్లగ నువ్వు బతుకరాదే
ఏడు జన్మల శోకం ఇచ్చెళ్ళిపోతివిగదే
పరాయి అత్తిన్ట్ల బదిలంగా ఉండమ్మా
పానంగా ప్రేమిస్తే కన్నీరే మిగిలెనమ్మా
పరాయి అత్తిన్ట్ల బదిలంగా ఉండమ్మా
పానంగా ప్రేమిస్తే కన్నీరే మిగిలెనమ్మా
పానంగా ప్రేమిస్తే కన్నీరే మిగిలెనమ్మా
పానంగా ప్రేమిస్తే కన్నీరే మిగిలెనమ్మా





