ఎర్రటి సంద్రం ఎగిసిపడే
హట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన బెట్టుగా ఉలిక్కిపడే జోరు
మన జట్టుగా ఆడెను సూడు
హే ఉప్పు కాలే నిప్పుల్లో సెగలెత్తే
హే డప్పు మోతల దిక్కుల్లో ఎలుగెత్తే
పులి బిడ్డల ఒంట్లో పూనకమే మోలకెత్తే
ఊరు గట్టే అత్తా కూలశక్తి శివమెత్తే
హైలా హైలా హయ్యారా
ఆయుధ పూజ చెయ్యాలా
జాతర జరగాలా జరుపుకోవాల జాతర
వీరాధి వీరుల జాతి తిరగాల
ఉడుకు రకతాల
హారతులీయాల ధారా ధీర హొ
హైలా ఇది అలనాటి ఆచారమే
ఇదిలా కొనసాగందే అపచారామే
బతుకే నేడు రణమైన పరివారమే
కడలి కాలం సాక్ష్యమే
మన తల్లుల త్యాగాలే
చనుపాలై దీవించే
కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది
తల వంచని రోషాలే
పొలిమేరలు సాధించే
మన జాతర సౌర్యం చరితలుగా వెలిగింది
ఏటేట వచ్చే ఈ రోజే మనకోసం
మెలి తిప్పి మీసం మనమిచ్ఛే సందేశం
హైలా హైలా హయ్యార
ఆయుధ పూజ చెయ్యాలా
జాతర జరగాలా జరుపుకోవాల జాతర
వీరాధి వీరుల జాతి తిరగాల
ఉడుకు రకతాల
హారతులీయాల ధారా ధీర హొ
ఎర్రటి సంద్రం ఎగిసిపడే
హట్లర్ ఇట్లర్ అదిరిపడి హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన బెట్టుగా ఉలిక్కిపడి జోరు
మన జట్టుగా ఆడెను సూడు





