డుం డక డుం డక
డుం డక డుం డక
నెలరాజుని ఇలరాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడిరాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి
ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల
ఓ' ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిల చెలి కన్నుల తన కళలను కనుగొని అచ్చెరువున మురిసి
అయ్యహో ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
ఇదిలా అని ఎవరైనా చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి
కథ కదిలే వరుసన
తమ ఎదలేం తడిసినా
గతజన్మల పొడవున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కళా




