ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ
ఎద తూలుతున్నది తేలుతున్నది నింగి అంచు దాటి
చెలరేగుతున్నది పోరుతున్నది ఆశ నిన్ను కోరి
ప్రియా అందుకున్నావా సరాగాలు సందేశం
చెలి చెంతకేరావా ఇంకా ఎందుకీ దూరం
హోయ్ ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ
తమరెవరో తమ పేరెంటో తెలియక ముందే
అరెరె నా మనసిచ్చానే వింతగ ఉందే
ఆ క్షణంలో చలి జ్వరంలా తగిలిందే తొలి చూపు
మరు క్షణంలో పద పదంటూ తరిమిందే నీ వైపు
నీ గడసరి మాటలు మెచ్చుకుని
నా సొగసులు నీకే ఇచ్చుకుని
ప్రియా చేరువైపోయా ఆహా ఏమి నీ మాయ
ప్రియా చేరువైపోయా ఆహా ఏమి నీ మాయ
ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ
నీ కిల కిల నవ్వుల వీణలు మ్రోగిన వేళ
నా మతి చెడి పరుగులు తీసెను నీ వెనకాల
ఇది నిజంగా ఓ కలేగా జతగాడై మన్మధుడే
నను వరించి మతి చెలించి నర నరాలు మీటాడే
నీ తడి తడి పెదవుల తేనెలని నా పెదవుల తపనలు తిర్చమనీ
చెలి కోరుకుంటున్నా నిన్నే వేడుకుంటున్నా
చెలి కోరుకుంటున్నా నిన్నే వేడుకుంటున్నా
ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన
నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ
ఎద తూలుతున్నది తేలుతున్నది నింగి అంచు దాటి
చెలరేగుతున్నది పోరుతున్నది ఆశ నిన్ను కోరి
ప్రియా అందుకున్నావా సరాగాలు సందేశం
చెలి చెంతకేరావా ఇంకా ఎందుకీ దూరం





