నీ ఇంటిముందు ఎలగాసెట్టు
దాన్నెక్కి వస్తా నీమీదొట్టు
అరే కట్టూకోవే నాతో జట్టు
మనమెల్లీ పోదాం ఖమ్మంమెట్టు
అరే ఎల్లీపోదాం ఖమ్మంమెట్టు
నువ్ ఎవ్వరి మాటలు నమ్మకే కిట్టూ
నే పొడుసుకున్నా పచ్చా బొట్టూ
నేనుంటా నీకు నచ్చీనట్టూ
కొనిపెడతా నీకు కోరిన చీరా
నీ జడలో ఎర్రని పూ మందారా
నువ్ నడిస్తే నాకు మాముల నడక
ఇటు రాయే సేద్దాం బాయీ గిరకా
నీ చూపులు గుండు సూదులే పిల్లా
నీ మాటలు కత్తుల దించెనే పొల్లా
నిన్నిడిసి బతకాలేనే పిల్లా
ఇడగొట్టుట ఎవ్వరి తరమే మల్లా
నేనుంటే సోపతి గాళ్లతో కూడి
నీ నవ్వులు నాపై చేసే దాడి
ఎటకారం చేస్తావేందే పోరి
నా గుండెలో కట్టిన నీకే గుడి
నువ్ కట్టితి వంటే లంగా ఓణి
నే కడతా నీపై సక్కని బాణి
ఈ జన్మకి నువ్వే నా యువరాణి
అయిపోతనే నీకు నే బానిసని
నీ అయ్యకు చెప్పకు పోదాం లేచి
అరే పెట్టకు పిల్లా అసలే పేచీ
నీకిస్తా జీవితమంతా రాసి
కాదంటే వెళ్లిపోతా కాశీ
నీ అందం సందం నాకే సొంతం
నువ్వుంటే సాలు పడతా కష్టం
నువ్వు మనసుకు నచ్చినవే బంగారం
నీకులేదా నామీద దాయాదాక్షిణ్యం





