కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగే సారంగమై
లిప్తలో క్షిప్తమే కానని కాలమే మొలకలే వేసే నా సొంతమై
నిన్నలో ఉన్న నీటి చారని కన్నులే తొంగి చూసుకోవని
అందుకోలేని అంతులేదని అంతటా సంతసం ఉందని
దారియే మారిపోయిందని దాగిపోలేదుగా ఆమని
చెయ్యి చాస్తున్న ఈ చెలిమిని చూడనీ కొత్తగా కొత్తని
సారిగామరిగరిస సారిగామరిగరిస సారిగామరిగరిసాగరిస రీసనిస
సారిగామరిగరిస సారిగామరిగరిస సారిగామరిగరిసాగరిస రీసనిస
కోరబోయిన రేవైనా తెరుపై పోయేనా
గురుతైనది చేదైనా మరుపై నీలోన
వెదురులోన మధుర గానమే వింటూవున్నా
పరుసవేది మనసు కోణమే చుస్తువున్నా
కరుసులేని నగవు బంధనాలు తీస్తూవున్నా
నాలోన నే లేని ఈ వేళన
తూరుపై ఉన్న చీకట్లని వేకువే వేరు చేస్తుందని
చేరువవుతున్న దూరాలలో చూడనా వెలుగులో వేడిని
సారిగామరిగరిస సారిగామరిగరిస సారిగామరిగరిసాగరిస రీసనిస
సారిగామరిగరిస సారిగామరిగరిస సారిగామరిగరిసాగరిస రీసనిస
కొత్తగా కొత్తగా కొత్తగా
కొత్తగా కొత్తగా కొత్తగా





