లాలి జో లాలి జో శభరీశా
అయ్యప్ప జో
లాలి జో లాలి జో మణికంఠ
లాలి జో లాలి జో మణికంఠ
చిన్ని చిన్ని నీ నీలి కన్నుల
జాలువారు నీలాలు
కన్న తండ్రిలా గుండె నిండెలే
పొంగి పొరలే పాలవెల్లిలా
అందాలు చిందేటి ఆ జాబిలే వచ్చి
ఈ నేల వాలిందని
పంపా ఝరి శభరి గిరి
పొంగేనులే కుమారా
చిన్ని చిన్ని నీ నీలి కన్నుల
జాలువారు నీలాలు
కన్నా కడు మోహాలతో
నిను కన్నయ్యలు సాక్షాత్
హరి హరులు
చిన్నా నిన్నిలాగున కన్నీళ్లలో
ముంచేసి వెళ్లారా
నీదే మహా కారణ జన్మము
నీవే మా కుల దీపము
మాతృత్వమే చరితార్దమైనది
నా స్తన్యమే ధన్యము
చిన్ని చిన్ని నీ నీలి కన్నుల
జాలువారు నీలాలు
ఓంకారమో హర తేజమో
ఏ జాలమో హరి మోహాన చెక్కింది
శ్రీకారమే సాకారమై సంస్కారమై
నీ రూపు దాల్చింది
నీ అన్నలో మలి మిన్నగా
నీ వన్నె పెరగాలిరా
వర్ధిల్లరా మకర జ్యోతిగా
ఆ చంద్ర తారార్గము
(వర్ధిల్లరా మకర జ్యోతిగా)
(ఆ చంద్ర తారార్గము)
చిన్ని చిన్ని నీ నీలి కన్నుల
చాలమ్మ నీలాలు
అందాలు చిందేటి ఆ జాబిలే వచ్చి
ఈ నేల వాలిందని
పంపా ఝరి శభరి గిరి
పొంగేనులే కుమారా
