కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు
రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు
కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు
తానే మంటై వెలుగిచ్చు దీపం చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్లు దారి ఓ ముళ్లదారి
నే వెళ్లు దారి ఓ ముళ్లదారి రాలేరు ఎవరూ నాతో చేరి
నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు
వేసవిలోనూ వానలు రావా కోవెల శిలకు జీవం రాదా
జరిగేనాడే జరుగును అన్నీ
జరిగేనాడే జరుగును అన్నీ జరిగిననాడే తెలియును కొన్నీ
నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు
కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు
సాహిత్యం: ఆత్రేయ





