ఏయ్ రుక్కమ్మ చుక్కమ్మ
ఈ మాట విన్నారటే
ఛీ సిగ్గమ్మ ఆ మాట
నా నోట చెప్పాలంటే
నమ్మానంటారో ఏమోనే
కుళ్లుకుంటారో ఏమోనే
నాలో ఏదో నచ్చి
కల్లో మారాజొచ్చి
పెళ్లాం post-u నాకే ఇస్తాడంటే
ఏ రత్తమ్మ అత్తమ్మ
ఈ మాట విన్నారటే
ఛీ సిగ్గమ్మ ఆ మాట
నా నోట చెప్పాలంటే
జాంగు చక్ చక్ జిన్ జాంగు చక్ చక్ జిన్
జాంగు చక్ చక్ జిన్ జాంగు చక్ చక్ జిన్
బారెడు ఎత్తున్నోడా
బోలెడు సొత్తున్నోడా
పోరడు ఎట్టాగుంటాడే
(చెప్పు పిల్లా చెప్పు చెప్పు)
సూర్యుడి కళ్లున్నోడే
చంద్రుడి నవ్వున్నోడే
వీరుడే నా వరుడు
(అబ్బో అమ్మో అమ్మో)
అలనాటి బాలుడా?
అతడైన సాలడే
అబ్బో భూమ్మీద అట్టాంటోడే పుట్టలేదంటే
(వామ్మో వామ్మో వామ్మో)
ఏ మేకమ్మ దూడమ్మా
ఈ మాట విన్నారటే
ఛీ సిగ్గమ్మ ఆ మాట
నా నోట చెప్పాలంటే
అంతగ తుళ్లి తుళ్లి
గెంతకే మళ్లీ మళ్లీ
ఆగవే పెళ్లి కూతురా
(ఆగు ఆగు ఆగు)
గుండెను గిల్లి గిల్లి
పందిరి అల్లి అల్లి
నాగిని కొంటె తొందరా
(అబ్బో అబ్బో అబ్బో)
ఇది ఏమి మాయరో
మతి పోయే దేవుడో
రాణీ వాసం నాకే
రాసిపెట్టి ఉందంటే
(వామ్మో వామ్మో వామ్మో)
ఏ బుజ్జమ్మ బుల్లమ్మ
ఈ మాట విన్నారటే
ఛీ సిగ్గమ్మ ఆ మాట
నా నోట చెప్పాలంటే
నమ్మానంటారో ఏమోనే
కుళ్లు కుంటారో ఏమోనే
నాలో ఏదో నచ్చి
కల్లో మారాజొచ్చి
పెళ్లాం post-u నాకే ఇస్తాడంటే
