ప్రాణమంతా సుప్రభాతం
సంధ్య స్వరాల కోలాహలం
పాడుతోందా కొత్త రాగం
ఇన్నాళ్ళ చేదు హాలాహలం
ఆ
వేవేల నేడు వెలిగింది నయనం
ఎటు వెళుతుందో ఈ నాటి పయనం
ఇదే నా కోరినా పిలుపు
ఇదే నా బ్రతుకున మలుపు
ఇదే నా రేపటి గెలుపూ ఊ
నేటి రహదారిలో తగిలిన
పిల్ల గాలి మరి ఏమన్నదో
నిన్నటి లో గుండెలొ అలసిన
జ్ఞాపకాల అల జుమ్మన్నదో
తడి చెమ్మ గా ఓ అలజడి
కనుపాపలో మొదలైనది
ఈ జన్మ లో మరు జన్మ గా
ఏం పండుగో ఎదురైనది
పెను మౌనం దాటి మాటాడు సమయం
భారాల్లన్ని వదిలింది హృదయం
ఇదేనా కోరినా పిలుపు
ఇదేనా బ్రతుకున మలుపు
ఇదేనా రేపటి గెలుపు ఊ





