కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి కంటి
కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి కంటి
మహనీయ ఘన ఫణామణుల శైలము కంటి
బహు విభవముల మంటపములు గంటి
మహనీయ ఘన ఫణామణుల శైలము కంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి
రహి వహించిన గోపురంబులనే కంటి
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి
రహి వహించిన గోపురంబులనే కంటి
కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి కంటి
పావనంబైన పాపవినాశము కంటి
కైవశంబగు గగన గంగ గంటి
పావనంబైన పాపవినాశము కంటి
కైవశంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి
కోవిదులు గొనియాడు కోనేరి కంటి
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి
కోవిదులు గొనియాడు కోనేరి కంటి
కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి కంటి
పరమ యోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజముల గంటి
పరమ యోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజముల గంటి
తిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి
తిరు వేంకటాచలాధిపు జూడకంటి
తిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి
తిరు వేంకటాచలాధిపు జూడకంటి
కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి కంటి
కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి కంటి
నిజమూర్తి కంటి, నిజమూర్తి కంటి




